Chandrababu: నీచమైన కుట్రలకు వైసీపీ తెరదీసింది: చంద్రబాబు ధ్వజం
- రాజధాని పట్ల ఆంధ్రులకున్న భావోద్వేగాలు వైసీపీకి తెలుసు
- అందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు
- అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న కుట్ర చేస్తున్నారు
- ఆ కుట్రలను బయటపెట్టేందుకే అమరావతిలో పర్యటిస్తున్నాను
నీచమైన కుట్రలకు వైసీపీ తెరదీసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆయన ఈ రోజు పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజధాని పట్ల ఐదు కోట్ల ఆంధ్రులకు ఉన్న భావోద్వేగాలు వైసీపీ వాళ్లకు తెలుసని ఆయన అన్నారు.
అందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేసి అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న నీచమైన కుట్రలకు వైసీపీ తెరదీసిందని చంద్రబాబు అన్నారు. ఆ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో పర్యటిస్తున్నానన్నారు. కాగా, అమరావతి అభివృద్ధికి తాము తమ ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు రూపొందిస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు పూర్తిగా నిలిచిపోతున్నాయని, వాటిని ఎత్తిచూపుతానని తెలుపుతూ చంద్రబాబు ఈ పర్యటనను ప్రారంభించారు.