: 'కేన్స్' లో అగంతకుడి హల్ చల్
కేన్స్ చిత్రోత్సవంలో ఓ అగంతకుడు తుపాకీతో హల్ చల్ చేశాడు. ఆస్కార్ విజేత క్రిస్టోఫ్ వాల్ట్ జ్, ఫ్రెంచి నటుడు డానియల్ అటోయిల్ లతో ఫ్రాన్స్ కు చెందిన 'కెనాల్+' టీవీ చానల్ పిచ్చాపాటీ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. కేన్స్ బీచ్ కు సమీపంలో వేసిన సెట్ లో ఈ షో కొనసాగుతుండగా.. అక్కడి జనసమూహంలో నుంచి ఓ వ్యక్తి అకస్మాత్తుగా పైకి లేచి తుపాకీతో గాలిలోకి రెండు రౌండ్లు కాల్చాడు.
తుపాకీ శబ్దం వినిపించిందో లేదో.. యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకు ఓపిగ్గా బదులిస్తోన్న నటులు వాల్ట్ జ్, అటోయిల్ ఇద్దరూ ప్రాణాలరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వెంటనే స్పందించిన భద్రత సిబ్బంది అగంతకుడిని బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడుగానీ, ఎక్కడో దాగిన నటులిద్దరూ బయటికిరాలేదు. ఇక టెలివిజన్ సిబ్బంది మాత్రం ఇంత జరిగినా కార్యక్రమం కంటిన్యూ చేస్తామనే చెప్పారు. కాగా, అదుపులోకి తీసుకున్న వ్యక్తి పిచ్చివాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద ఉన్న గ్రెనేడ్ డమ్మీదని తేల్చారు.