: ఆంధ్రజ్యోతి ఎండీకి కోర్టు సమన్లు జారీ


ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 2012 ఆగష్టు 13వ తేదీన ఇన్డ్ భారత్ ఎనర్జీస్ పరిశ్రమకు ఎనిమిది వందల కోట్ల రూపాయాల పెట్టుబడులు అక్రమంగా వచ్చాయంటూ కధనం ప్రచురించారని, దీంతో తమ కంపెనీ పరువుకు నష్టం కలిగిందని ఆంధ్రజ్యోతి కథనంపై భరత్ ఎనర్జీస్ కంపెనీ డిప్యుటీ జనరల్ మేనేజర్ బీవీఎస్ ప్రసాద్ పరువునష్టం కేసు వేశారు. ఆంధ్రజ్యోతి కథనంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కూడా చేపట్టిందని పిటీషన్ లో పేర్కొన్నారు. దీంతో వివరాలు పరిశీలించిన కోర్టు 17 వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం సెక్షన్ 34, 384 , 506 మరియు 120(బీ) క్రింద వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్ మరియు అమోద పబ్లికేషన్స్ మీద కేసులు నమోదు చెయ్యాల్సిందిగా ఆదేశించిన న్యాయమూర్తి నిందితులను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News