Maharashtra: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ బరిలో ఆరుగురు.. ఎవరెవరంటే..?

  • మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే బలపరీక్ష
  • ప్రొటెం స్పీకర్ పదవి కోసం ఆరుగురి పేర్లను గవర్నర్ కు పంపిన ప్రభుత్వం
  • ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో బిజీగా ఉన్న పార్టీలు

రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో... మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. పూర్తి స్థాయి స్పీకర్ అవసరం లేదని... ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే బలపరీక్షను నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. దీంతో, ప్రొటెం స్పీకర్ నియామకంపై తర్జనభర్జన కొనసాగుతోంది. ఈ పదవి కోసం ఆరుగురి పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి ప్రస్తుత ప్రభుత్వం ఓ జాబితాను పంపించింది.

ఈ జాబితాలో రాధాకృష్ణ పాటిల్ (బీజేపీ), బాబన్ రావు భికాజీ (బీజేపీ), కాళిదాస్ కోలంబ్కర్ (బీజేపీ), కేసీ పద్వి (కాంగ్రెస్), బాలాసాహెబ్ థోరత్ (కాంగ్రెస్), దిలీప్ వాల్సే పాటిల్ (ఎన్సీపీ) పేర్లు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేలలో వీరే అత్యంత సీనియర్లు. సీనియారిటీ ఎక్కువ ఉన్న వారికి ప్రొటెం స్పీకర్ బాధ్యతలను కట్టబెట్టడం ఆనవాయతీ. వీరిలో ఒకరిని ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ఎంపిక చేయనున్నారు. మరోవైపు, బలపరీక్ష రేపే కావడంతో... తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో అన్ని పార్టీలు తలమునకలయ్యాయి.

More Telugu News