: ఖమ్మం జిల్లాలో బెట్టింగుల జోరు... పలువురి అరెస్ట్
ఒకవైపు స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తుండగా మరోవైపు బెట్టింగ్ బాబులు పేట్రేగి పోతున్నారు. ఐపీఎల్ సీజన్ ముగింపుదశకు చేరుకుంటున్న దరిమిలా మ్యాచ్ లన్నీ నువ్వా? నేనా? అనేలా సాగుతున్నాయి. నాకౌట్ దశకు చేరుకుంటున్న టోర్నీలో ఇకపై జరిగే ప్రతిమ్యాచ్ ప్రాముఖ్యత కలిగినదే. దీంతో అందినకాడికి సొమ్ము చేసుకుందామనుకుంటున్న బెట్టింగ్ బాబులు ఖమ్మం జిల్లాలో కాయ్ రాజా కాయ్ అంటూ పందాల్లో మునిగి తేలుతున్నారు. దీంతో వాడవాడలా బెట్టింగ్ కేంద్రాలు వెలిశాయి. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఖమ్మంలో ఓ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. సత్తుపల్లి, తల్లాడ, అశ్వారావుపేట, దమ్మపేటల్లో మరో 23 మంది బుకీలను అరెస్టు చేసారు.