Maharashtra: అందుకే మొదట బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు: శరద్ పవార్

  • బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ లేదు 
  • ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని గవర్నర్ కు లేఖ కూడా రాశారు
  • మేము మా ఎమ్మెల్యేలతో కలిసి చర్చలు జరుపుతున్నాం
  • ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఎన్సీపీ మద్దతు తెలపట్లేదు

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీని కొన్ని రోజుల క్రితం గవర్నర్ కోష్యారీ ఆహ్వానించినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ లేదు.. అందుకే మొదట ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తమకు మెజారిటీ లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని గవర్నర్ కు లేఖ కూడా రాశారు' అని తెలిపారు.

'మేము మా ఎమ్మెల్యేలతో కలిసి చర్చలు జరుపుతున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఎన్సీపీ మద్దతు తెలపడం లేదు' అని శరద్ పవార్  స్పష్టం చేశారు. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంత్ రావ్ చౌహాన్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు శరద్ పవార్.. కరాద్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News