Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ నైతికంగా, రాజకీయంగా గెలిచింది: కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్

  • కాంగ్రెస్ పార్టీయే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
  • మహారాష్ట్రలో బీజేపీ, శివసేనకు మద్దతుగా ప్రజలు తీర్పునిచ్చారు
  • బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నివీస్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు 
  • దీనిపై కాంగ్రెస్ తిరిగి మమ్మల్నే ప్రశ్నిస్తోంది

మహారాష్ట్రలో బీజేపీ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ...  'మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్పునిచ్చారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు' అని వ్యాఖ్యానించారు.

'కాంగ్రెస్ పార్టీయే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్య వ్యతిరేకపూరిత ధోరణితో వ్యవహరించడమే గాక దీనిపై మమ్మల్నే ప్రశ్నిస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ నైతికంగా, రాజకీయంగా గెలిచింది. కాంగ్రెస్ మాత్రం మహారాష్ట్రను తప్పుడు పద్ధతిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది' అని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

More Telugu News