Spicejet: తిరుపతిలో స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం

- పేలిపోయిన టైరు
- ల్యాండింగ్ చేస్తుండగా ఘటన
- చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్
స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం ప్రమాదం నుంచి తప్పించుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతి చేరుకున్న ఆ విమానం టైరు పేలిపోయింది. విమానం ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా టైరు పేలినట్టు గుర్తించిన పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఆపద వాటిల్లలేదు. ఇక్కడి రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి వెంటనే మరమ్మతులు నిర్వహించారు.