: ప్రధాని రాజీనామాపై సడలని బీజేపీ పట్టు


బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామాపై బీజేపీ ఇంకా మెత్తబడలేదు. ఈ నెల 27 నుంచీ జూన్ 2 వరకూ నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు బీజేపీ జనరల్ సెక్రటరీ అనంత కుమార్ లక్నోలో మీడియాకు వెల్లడించారు. ప్రధాని రాజీనామా, యూపీఏ అవినీతి, ధరల పెరుగుదల... మొదలైన అంశాలపై నిరసన వ్యక్తం చేయనున్నట్లు అనంతకుమార్ తెలిపారు.

బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదికను, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు, న్యాయమంత్రి ఇతరులతో పంచుకున్నానంటూ సీబీఐ డైరెక్టర్ సుప్రీం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రధాని, న్యాయమంత్రి రాజీనామా కోరుతూ బీజేపీ పార్లమెంట్ రెండో దఫా బడ్జెట్ సమావేశాలను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. వీరి ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం న్యాయమంత్రి అశ్వనికుమార్, మేనల్లుడి లంచం వ్యవహారంలో రైల్వే మంత్రి బన్సల్ ను మంత్రివర్గం నుంచి తప్పించింది. అయితే, ఇందులో ప్రధానికీ పాత్ర ఉన్నందున కూడా రాజీనామాపై పెద్ద ఎత్తున పోరాడాలని బీజేపీ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News