: జగన్ అవినీతిని ప్రత్యేక న్యాయస్థానంలో విచారించాలి: సోమిరెడ్డి
భారీ అవినీతి, కుంభకోణాలు జరిగినప్పుడు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేసారు. వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ 43 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు సీబీఐ చెబుతోందని అన్న ఆయన, జగన్ భారీ అవినీతిని ప్రత్యేక న్యాయస్థానంలో విచారించి శిక్షను అమలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ పై రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.