Arunachal Pradesh: దాదాపు 60 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది: అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ 

  • భారత్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి
  • లేకపోతే డోక్లాం తరహా ఇబ్బందులు అరుణాచల్ ప్రదేశ్ లో కూడా నెలకొంటాయి
  • అరుణాచల్ ప్రదేశ్ లో మోదీ పర్యటించినప్పుడు కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది

అరుణాచల్ ప్రదేశ్ లోని మన భూభాగాన్ని దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల మేర చైనా ఆక్రమించిందని బీజేపీ ఎంపీ తాపిర్ గావ్ ఆరోపించారు. లోక్ సభలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, తక్షణమే భారత్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని... లేకపోతే డోక్లాం తరహా ఇబ్బందులు అరుణాచల్ ప్రదేశ్ లో కూడా నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించినప్పుడు కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఆర్మీ కెప్టెన్ గా అరుణాచల్ ప్రదేశ్ లో పని చేసిన ప్రాంతం ఇప్పుడు భారత భూభాగంలో లేదని తాపిర్ తెలిపారు.

More Telugu News