Whatsapp: వాట్సాప్ యూజర్లను అప్రమత్తం చేస్తున్న భారత ఆర్మీ!

  • వాట్సాప్ గ్రూపులపై హ్యాకర్ల కన్ను
  • భద్రత బలగాల గ్రూపులే లక్ష్యంగా కార్యకలాపాలు
  • +86తో మొదలయ్యే నంబర్లు ప్రమాదకరం అంటున్న ఆర్మీ

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై ఇటీవల హ్యాకర్లు తరచుగా దాడులకు దిగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, భారత ఆర్మీ కూడా వాట్సాప్ యూజర్లు ఎంతో  జాగ్రత్తగా వ్యవహరించాలని పలు సూచనలు చేస్తోంది. భారత భద్రతా బలగాలకు చెందిన 98 వ్యవస్థలకు చెందిన కంప్యూటర్లనే కాకుండా, సాధారణ ప్రజల సోషల్ మీడియా అకౌంట్లపైనా చైనా, పాకిస్థాన్ హ్యాకర్ల కన్నుపడిందని ఆర్మీ నిఘా వర్గాలంటున్నాయి. ముఖ్యంగా, భారత జవాన్లు ఉన్న వాట్సాప్ గ్రూపులపై దాడులకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని ఆర్మీ చెబుతోంది.

అందుకే వాట్సాప్ గ్రూపుల విషయంలో ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రూపుల్లో అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా గ్రూప్ అడ్మిన్స్ కు సమాచారం అందించాలని సూచించింది. గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్ ల విషయంలోనూ జాగరూకత వహించాలని, ముఖ్యంగా +86తో ప్రారంభమయ్యే నంబర్లు మరింత ప్రమాదకరం అని ఆర్మీ నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ తరహా నంబర్లతో ఏకంగా ఆర్మీ అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో చొరబడి కీలక సమాచారం తస్కరించే ప్రయత్నం చేశారని వివరించాయి.

More Telugu News