Chandrababu: జాతీయ స్థాయిలో జగన్ ఎలాంటి పేరు తెచ్చుకున్నారన్న దానికి ఈ పత్రికా కథనాలే నిదర్శనం: చంద్రబాబు
- ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పారు
- ఐదు నెలల్లోనే ముంచుతున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు
- ప్రజలకు ఏం చేయాలో ఇప్పటికైనా ఆలోచించాలి
ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆరు నెలల్లో 'మంచి' ముఖ్యమంత్రి అనిపించుకుంటానని జగన్ చెప్పారని... కానీ ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని 'ముంచుతున్న' ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. దీనికి ఈ పత్రికా కథనాలే నిదర్శనమంటూ నవంబర్ 14న ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. తన మీద కక్షతో తాను నిలబెట్టిన వాటిని కూల్చే పనిని ఆపేసి... ప్రజలకు ఏం చేయాలో ఇప్పటికైనా ఆలోచించాలని సూచించారు.