: కర్ణాటక సీఎం కు అప్పుడే అసమ్మతి సెగలు
మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన కాసేపటికే కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అసంతృప్తి సెగలు ఎదురయ్యాయి. పదవులు పొందని అసంతృప్త నేతలు రాజీనామాలకు సిద్దమయ్యారు. మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అనీల్ లాడ్ ప్రకటించారు. గనుల కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అనీల్ లాడ్, శివకుమార్ లకు మంత్రి వర్గంలో సీఎం సిద్దరామయ్య చోటు కల్పించలేదు.