Vijay Sai Reddy: నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారు: విజయసాయి రెడ్డి

  • చంద్రబాబు, లోకేశ్ లపై విజయసాయి రెడ్డి విమర్శలు
  • కొడుకేమో 4 గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష అన్నాడు
  • ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత సమస్యపై ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి రాత్రి‌ 8 గంటల వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు దిగనున్నారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తెలియజెప్పడానికే ఇసుక దీక్ష చేస్తున్నామని టీడీపీ నేతలు ప్రకటించారు. అలాగే, 14వ తేదీ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.

'కొడుకేమో నాలుగు గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష అన్నాడు. ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట. నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారు. కనీసం ఒక రోజైనా భోజనానికి దూరం ఉండలేని వాళ్లు ప్రచారం కోసం దీక్షల పేర్లు ఉపయోగిస్తున్నారు' అని విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News