: సీపీఎం విధానాలు పనికిమాలినవి: సీపీఐ నేత బర్దన్
సీపీఐ జాతీయ నేత బర్దన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తోటి వామపక్షం సీపీఎం విధానాలను తప్పుబట్టారు. సీపీఎం విధానాలు పనికిమాలినవిగా పేర్కొనడమే కాకుండా, ఆ పార్టీ అగ్రకులాల వారికే పెద్దపీట వేస్తోందంటూ మండిపడ్డారు. కాలంతోపాటు ఎవరైనా మారాల్సిందేనని హితవు పలికారు. మరి, సీపీఐలో ఏ మార్పుందో మాత్రం బర్దన్ వెల్లడించలేదు. ఇక తెలంగాణ కోసం పోరాడినా తమ పార్టీది టీఆర్ఎస్ భావజాలం కాదని బర్దన్ స్పష్టం చేశారు. బర్దన్ కటువు వ్యాఖ్యలపై సీపీఎం ఎలా స్పందిస్తుందో చూడాలి.