Chandrababu: తప్పుడు కేసులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం
- ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు
- అలాచేస్తే రాష్ట్రంలో తమ అక్రమాలకు అడ్డు ఉండదని వైసీపీ భావిస్తోంది
- వైఖరిని మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదు
ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే రాష్ట్రంలో తాము చేసే అక్రమాలకు అడ్డు ఉండదని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ పార్టీ నేతలు తమ వైఖరిని మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం ఐతేపల్లిలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ నేతల చేతిలో బాధితులుగా మారిన ప్రజల సమస్యలను గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పోలీసులు కొందరిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సర్కారు చేస్తోన్న తప్పులను బయటకు తెలియనివ్వకుండా దాచడానికి అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు.