actress: ఆ చిత్రంలో నటించి తప్పు చేశా: నయనతార

  • ‘గజనీ’ చిత్రంలో నటించినందుకు పశ్చాత్తాపం
  • ఆ సినిమాలో తన పాత్రపై అంచనా తప్పిందన్న నయనతార
  • ఆసిన్ పాత్ర తో సమానంగా తన పాత్ర లేదని అసంతృప్తి

తెలుగు, తమిళ చిత్రాల్లో విభిన్నపాత్రలను పోషిస్తూ లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార 'గజనీ' చిత్రంలో ‘చిత్ర’ పాత్రలో నటించి తప్పుచేశానన్నారు. 2005లో విడుదలైన ఈ చిత్రంలో తాను పోషించిన పాత్రపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో నటించడంపై ఆ తర్వాత పశ్చాత్తాప పడ్డానని చెప్పారు.

‘ఈ సినిమాలో నా పాత్ర,  ఆసిన్ నటించిన ‘కల్పన’ పాత్రతో సమానంగా ఉంటుందని అనుకున్నాను కానీ, అలా లేదు’ అని నయనతార ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరోగా సూర్య, హీరోయిన్ గా అసిన్ నటించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్టయింది.

ఇక నయనతార ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’లో నటించారు. ఈ సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆమె దర్బార్ చిత్రంలో హీరోయిన్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

More Telugu News