: మూడు గంటల్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా 2.41కోట్ల చోరీ


జాగ్రత్తగా ఉండకపోతే ఎంతటి వారైనా సైబర్ నేరగాళ్ల చేతిలో చిత్తయిపోతారు అనేదానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ప్రముఖ పారిశ్రామిక గ్రూపు ఆర్ పీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి నిలువునా మోసపోయింది. నేరగాళ్లు ట్రోజన్ మాల్ వేర్ వైరస్ ద్వారా కంపెనీకి చెందిన ముంబైలోని కరెంట్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ను తస్కరించారు. తర్వాత ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ నెల 11న ఉదయం 11.30 నుంచి 2.30లోపు 13 లావాదేవీల ద్వారా ఆర్ పీజీ ఖాతా నుంచి 2. 41 కోట్ల రూపాయలను వేరే ఖాతాల్లోకి తరలించి కొట్టేశారు.

పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతుండడంతో బ్యాంకు అధికారులు ఆర్ పీజీ గ్రూప్ నకు సమాచారం అందించారు. లావాదేవీలు తమవి కావని తెలుసుకున్న ఆర్ పీజీ ముంబైలోని వర్లి పోలీసులకు సమాచారం అందించింది. సైబర్ నేరగాళ్లు డబ్బును తరలించిన మూడు ఖాతాలను గుర్తించారు. కోయంబత్తూరు, హైదరాబాద్ కు చెందిన ఖాతాదారులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్ లైన్ బ్యాంకింగ్, ఏటీఎం, క్రెడిట్ కార్లుల వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇలా మోసగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది.

  • Loading...

More Telugu News