: తూ.గో. జిల్లా థర్మల్ ప్రాజెక్టు ఘటనపై హెచ్చార్సీ ఆదేశాలు


తూర్పు గోదావరి జిల్లా రంగంపేట థర్మల్ ప్రాజెక్టు బాధితుల ఘటనపై ఏప్రిల్ 4వ తేదీలోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చింది. కొన్నిరోజుల కిందట స్థానికంగా చేపడుతున్నథర్మల్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని రంగంపేట వాసులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారిపై పోలీసులు లాఠీఛార్జి జరిపారు.

దీనిపై ఈ రోజు 
బాధితులు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆ్రశయించారు. శాంతియుతంగా ఆందోళన చేసిన తమపై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జి చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్చార్సీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

  • Loading...

More Telugu News