Sanjay: 'ఒక చిన్న విరామం' నుంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్

  • విభిన్నమైన కథాంశంతో 'ఒక చిన్న విరామం'
  • దర్శకుడిగా సందీప్ చేగూరి పరిచయం 
  • ఒక కథానాయికగా పునర్నవి

సందీప్ చేగూరి దర్శకత్వంలో వైవిధ్యభరితమైన కథాకథనాలతో 'ఒక చిన్న విరామం' అనే సినిమా రూపొందుతోంది. సంజయ్ వర్మ .. పునర్నవి .. నవీన్ .. గరిమా సింగ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, కంటెంట్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. భరత్ మంచిరాజు సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.' బిగ్ బాస్ 3' ద్వారా పాప్యులర్ అయిన పునర్నవికి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

More Telugu News