Guntur District: ఉపాధి లేక మరో కార్మికుడి బలవన్మరణం

- గుంటూరు జిల్లాలో మరో విషాదం
- వెంకటేశ్ అనే ప్లంబర్ ఆత్మహత్య
- చనిపోయే ముందు వీడియో సెల్ఫీలో ఆవేదన
ఏపీలో ఇసుక కొరత తీవ్రరూపు దాల్చుతోంది. భవన నిర్మాణ, సంబంధిత రంగాల కార్మికుల బలవన్మరణాలే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో ఇద్దరు మేస్త్రీలు ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే మరో కార్మికుడు తనువు చాలించాడు. గుంటూరు జిల్లాకు చెందిన పోలేపల్లి వెంకటేశ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్ ఓ ప్లంబర్. అయితే కొంతకాలంగా భవన నిర్మాణ రంగం స్థంభించిపోవడంతో ఉపాధి లేక ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్టు వెంకటేశ్ బలవన్మరణానికి ముందు వీడియో సెల్ఫీలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. వెంకటేశ్ ఆత్మహత్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.