State Bank of India: లాభాల్లో దూసుకుపోయిన ఎస్బీఐ

  • రెండో త్రైమాసికంలో మూడు రెట్ల నికర లాభాల నమోదు
  • పెరిగిన బ్యాంక్ ఆదాయం
  • తగ్గిన నిరర్ధక ఆస్తులు

అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  రెండో త్రైమాసికంలో అద్భుత ఫలితాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 3,011.73 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో నమోదు చేసిన రూ.944.87 కోట్లతో పోలిస్తే పెరుగుదల మూడు రెట్లుగా ఉంది. ఏకీకృత నికర లాభాల్లో ఆరు రెట్లు వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఇవి రూ.3,375.40 కోట్లుండగా, గత ఏడాది ఇదే కాలంలో ఇవి  రూ.576.46 కోట్లుగా ఉన్నాయి.

ఈ త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం కూడా పెరిగింది. ప్రస్తుతం రూ.89,347.91 కోట్ల ఆదాయాన్ని ఎస్ బీఐ పొందగా, గత  ఏడాది ఇదే సమయంలో ఆదాయం రూ.79,302.72 కోట్లుగా ఉంది. బ్యాంకు ఎన్ పీఏల పరిమాణంలో కూడా తగ్గుదలను నమోదు చేసింది. గత ఏడాది రెండో త్రైమాసికం ముగింపు నాటికి 9.95 శాతం ఉన్న ఎన్ పీఏలు ఈ  ఏడాది అదే కాలానికి 7.19 శాతానికి చేరుకున్నాయి.

More Telugu News