Andhra Pradesh: ఏపీ ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పై ఉంది: టీడీపీ నేత పయ్యావుల కేశవ్
- నాడు చంద్రబాబు సర్కార్ అప్పులు చేసిందంటున్నారు
- మా హయాంలో రూ.22 వేల కోట్లు అప్పులు చేశాం
- వైసీపీ ప్రభుత్వం 3 నెలల్లోనే రూ.18 వేల కోట్లు అప్పు చేసింది!
ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ దుమ్మెత్తిపోశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పై ఉందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి పరిపాలన చేతకాకనే చంద్రబాబు పాలనపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాజధాని అమరావతిని చంపేసే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే, డబ్బులు లేవని చెబుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్ అప్పులు చేసిందని వైసీపీ నేతలు గోలపెడుతున్నారని, నాడు తమ సర్కార్ రూ.22 వేల కోట్లు అప్పులు చేస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం మూడు నెలల్లోనే రూ.18 వేల కోట్లు అప్పు చేయడం నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ఖజానా ఖాళీ అవ్వలేదని, ఖజానాకు తాళం వేస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుందని సూచించారు.