: మన తీరాన్ని పలకరించిన రుతుపవనాలు


ఎండలతో ఉడికిపోతున్న రాష్ట్ర ప్రజలకు ఒకింత చల్లటి కబురు. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ తీరంలోకి ప్రవేశించాయి. మరో మూడు రోజుల్లో తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించి, జూన్ 3 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెడతాయని తెలిపింది. ఇవి బాగా విస్తరిస్తే ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసింది. దేశ వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలే ఆధారం. దేశీయ నీటి అవసరాలను కూడా దాదాపుగా 70శాతం వరకూ నైరుతి రుతుపవనాలే తీరుస్తున్నాయి.

  • Loading...

More Telugu News