: చంద్రబాబు పాదయాత్ర దేని కోసం?: కొండ్రు మురళీ
పాదయాత్ర చేస్తున్నది ప్రజల కోసమా? లేక, రికార్డుల కోసమా? అని టీడీపీ అధినేత చంద్రబాబుని మంత్రి కొండ్రు మురళి సూటిగా ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తున్న చోట్ల స్థాపిస్తున్న స్థూపాలు ఆయన అవినీతికి నిదర్శనమన్నారు. హైదరాబాదు సచివాలయంలో మీడియాతో కొండ్రు మాట్లాడారు.
ఈ సందర్భంగా బాబుపై తీవ్రంగా మండిపడ్డారు. బాబు నాయకత్వంలో రోజురోజుకూ టీడీపీ నాశనమైపోతుందని విమర్శించిన మంత్రి, చంద్రబాబు నాయకత్వాన్ని మార్చుకుంటే టీడీపీ బాగుపడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పై లేనిపోని పిచ్చి మాటలు మాట్లాడవద్దని కొండ్రు హెచ్చరిం