ACP: విధుల్లో అలసత్వానికి మూల్యం.. ఏసీపీ నరసింహారెడ్డి బదిలీ

  • ప్రగతిభవన్ ముందు ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆసిఫ్ నగర్ ఏసీపీ
  • డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు
  • డీసీపీ సుమతికి  ఆసిఫ్ నగర్ సబ్ డివిజన్ బాధ్యతలు

విధుల్లో అలసత్వం వహించడంతో ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ వేటు పడింది. నరసింహారెడ్డి ప్రగతిభవన్ ముందు ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆసిఫ్ నగర్ సబ్ డివిజన్ బాధ్యతలను డీసీపీ సుమతికి అప్పజెప్పారు.

More Telugu News