Srisailam: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం!

  • ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ‘కృష్ణ’కు మళ్లీ వరద నీరు
  • ఈరోజు రాత్రికి జలాశయం గేట్లు ఎత్తనున్న అధికారులు
  • శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 3.36 లక్షల క్యూసెక్కులు

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి మళ్లీ వరద పోటెత్తింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో, ఈరోజు రాత్రికి జలాశయం గేట్లు ఎత్తి వరద నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 3.36 లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 68.743 క్యూసెక్కులు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

More Telugu News