Andhra Pradesh: ఏపీ ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ లో మార్పు
- విశాఖ, న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్
- కొత్త షెడ్యూల్ ప్రకటించిన రైల్వే శాఖ
- జనవరి 23 నుంచి అమలు
విశాఖపట్నం-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలు షెడ్యూల్ లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం రాత్రి 10 గంటలకు విశాఖలో బయలుదేరి మూడో రోజు ఉదయం 6.35 నిమిషాలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. తిరిగి న్యూఢిల్లీలో రాత్రి 8.15 గంటలకు బయల్దేరి మూడోరోజు ఉదయం 5.05 గంటలకు విశాఖ చేరుకుంటుంది. షెడ్యూల్ తో పాటే ఏపీ ఎక్స్ ప్రెస్ నెంబర్ కూడా మార్చారు. ఈ కొత్త షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరి 23 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటించారు.