: ఐపిఎల్ పోరు ఇక రసవత్తరం
ఏప్రిల్ 3న ప్రారంభమైన ఐపిఎల్-6 సీజన్ మ్యాచుల హోరు జోరుగా సాగుతోంది. మరో తొమ్మిది రోజులలో అంటే మే 26తో ఐపిఎల్ మ్యాచులకు తెరపడుతుంది. ఇప్పటి నుంచీ జరిగే ప్రతీ మ్యాచు ప్రతీ జట్టుకు కీలకం కానుంది. అన్ని వర్గాల ప్రజలూ ఐపిఎల్ ను ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా చూస్తున్న తరుణంలో స్పాట్ ఫిక్సింగ్ బయటపడడం కొంత ప్రతికూల వాతావరణానికి దారితీసింది. ప్రేక్షకులలో మ్యాచు ఫలితాల పట్ల అపనమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇక మిగిలి ఉన్న మ్యాచులపై ప్రేక్షకులలో ఇంతకుముందు ఉన్నంత ఉత్సుకత ఉండకపోవచ్చంటున్నారు.
ఐపిఎల్ పోరులో భాగంగా ఈ రోజు పంజాబ్ కింగ్స్ 11, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక బెంగళూరు రాయల్ చాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బెంగళూరులో రాత్రి 8 గంటలకు ఆట మొదలవుతుంది.