: పని ఒత్తిడి పెరిగితే గుండెజబ్బులొస్తాయ్‌...!


పని ఒత్తిడి పెరిగితే దాని ఫలితంగా గుండెజబ్బులొస్తాయట... అంతేకాదు రక్తంలోని కొవ్వుల స్థాయిలు కూడా అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనేవారికి, వారి జీవక్రియలకూ మధ్యగల సంబంధాన్ని పరిశోధకులు విశ్లేషించారు. పని నిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనేవారికి రక్తంలోని కొవ్వులు అస్తవ్యస్తం అయ్యే వ్యాధి (డిస్‌లిపిడిమియా) ముప్పు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

ఈ విషయం గురించి సైకాలజిస్ట్‌ కార్లోస్‌ క్యాటలీనా మాట్లాడుతూ పనిలో వత్తిడి ఎదుర్కొనేవారిలో మంచి కొలెస్టరాల్‌ స్థాయిలకన్నా చెడ్డ కొలెస్టరాల్‌ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు తేలిందని, ఈ చెడ్డ కొలెస్టరాల్‌ రక్తనాళాల్లో అడ్డంకిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా గుండెజబ్బుకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పనిలో ఒత్తిడిని దూరంచేసుకునేందుకు ప్రయత్నించి... మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా...!

  • Loading...

More Telugu News