Bigboss: ఈ సీజన్ ‘బిగ్ బాస్’పై శివబాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ఈ సీజన్ షోలో ఎంటర్ టైన్ మెంట్ లోపించింది
  • అందుకే, ఈ సీజన్ తనకు కనెక్ట్ కాలేదు
  • ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీగా ఉన్నా

ప్రముఖ నటుడు, ‘బిగ్ బాస్’ సీజన్ వన్ విన్నర్ శివబాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్ ‘బిగ్ బాస్’ ను మొదట్లో చూశానని, ఆ తర్వాత చూడట్లేదని చెప్పారు. ఓ యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సీజన్ ‘బిగ్ బాస్’ ను తాను చూడకపోవడానికి గల కారణాలను వివరించాడు. తనకు ఎంటర్ టైన్ మెంట్ అంటే చాలా ఇష్టం అని, అయితే, అది ఈ సీజన్ లో లోపించిందని, అందుకే, ఈ సీజన్ తనకు కనెక్ట్ కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీగా ఉండటం, వ్యక్తిగత పనుల కారణంగా ఈ సీజన్ ‘బిగ్ బాస్’ ను పూర్తిగా చూడలేకపోతున్నానని చెప్పారు.  

More Telugu News