: బ్రెయిన్ ట్రైనింగ్‌తో లెక్కలొస్తాయ్...!
మన మెదడుకు మంచి ట్రైనింగ్ ఇచ్చామంటే అప్పుడు మన మెదడు చక్కగా పనిచేస్తుంది, దీంతో మనకు రావనుకున్న లెక్కలు కూడా వచ్చేసాయి. ఈ విషయాన్ని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు. ట్రాన్స్ క్రేనియల్ రాండమ్ నాయిస్ స్టిమ్యులేషన్ (టీఆర్‌ఎన్‌ఎస్) గా పేర్కొంటున్న ఈ శిక్షణలో మెదడుకు ప్రమాదరహితమైన ఉద్దీపనలు కలిగించడం ద్వారా మెదడును ఉత్తేజితం చేయవచ్చని, ఫలితంగా అతిక్లిష్టంగా భావిస్తున్న గణిత సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాగ్నిటివ్ ట్రైనింగ్‌గా పిలవబడే ఈ ప్రమాదరహిత ఉద్దీపనల ద్వారా మెదడు ఉత్తేజితమై గణిత సామర్ధ్యం బాగా వృద్ధి చెందిందని పరిశోధకులు చెబుతున్నారు.