: బ్రెయినే బాస్‌...


మన శరీరంలోని పలు కదలికలను, మనం చేసే పనులను మన మెదడు నిర్ణయిస్తుంది. చెవితో వినడం వరకూ ఓకే కానీ ఏ చెవితో వినాలి అనే విషయాన్ని కూడా మన మెదడే నిర్ణయిస్తుందట... ఈ విషయం తమ పరిశోధనలో ఋజువైందంటున్నారు డెట్రాయిట్‌లోని హెన్రీఫోర్డ్‌ ఆసుపత్రికి చెందిన శాస్త్రవేత్తలు. మనం చేసే పనులపై మెదడు ఆధిపత్యం ఉంటుంది. అయితే మెదడు ఆధిపత్యానికి, చెవి యొక్క శబ్ద గ్రహణానికి మధ్య మంచి సంబంధం ఉన్నట్లు తమ పరిశోధనలో ఋజువైందని, మెదడులోని ఎడమ భాగం ద్వారా ఎక్కువగా ఆలోచనలు చేసేవారు వినడానికి కుడి చెవిని ఉపయోగిస్తున్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ విషయానికి సంబంధించిన చేసిన పరిశోధనల్లో దాదాపు 95 శాతం మంది మెదడు ఎడమ పార్శ్వం ద్వారా ఆలోచనలు చేయడానికి, సెల్‌ఫోన్‌ మాట్లాడేందుకు కుడిచేతిని, వినడానికి కుడి చెవిని ఉపయోగిస్తున్నట్టు తేలింది. వీరి భాష, సంభాషణలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం మెదడు ఎడమవేపు భాగంలోనే జరుగుతుందని, అందువల్ల వారు వినడానికి కుడి చెవిని ఉపయోగిస్తున్నారని తమ పరిశోధనలో తేలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనలో వారు సుమారు ఐదువేల మందిని అధ్యయనం చేశారు. కాబట్టి మెదడు పనులు చేయించడానికే కాదు... ఏ పని ఏ భాగం చేయాలో కూడా నిర్ణయిస్తుందన్న మాట...!

  • Loading...

More Telugu News