: ఆదుకున్న యువకెరటం
ఒడిశా యువ బ్యాట్స్ మన్ బిప్లబ్ సామంత్ రే.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆపద్బాంధవుడిలా అవతరించాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును బిప్లబ్ (55) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ ను రాజస్థాన్ రాయల్స్ పేసర్ జేమ్స్ ఫాక్ నర్ (5/16) దారుణంగా దెబ్బతీశాడు.