tsrtc: ఆర్టీసీ కార్మికులవి గొంతెమ్మ కోరికలు.. మాకు ప్రజలే ముఖ్యం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

  • ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు అనైతికం
  • ప్రజల అవసరాలు తీర్చడమే మాకు ముఖ్యం
  • కాంగ్రెస్, బీజేపీలకు మంత్రి సూటి ప్రశ్న

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. కార్మికులవి గొంతెమ్మ కోరికలని విమర్శించారు. వారి డిమాండ్లు తీర్చడం కంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడమే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు. ఉద్యోగుల కన్నా ఆర్టీసీ కార్మికులకే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చామని తెలిపారు. వారి డిమాండ్లు పూర్తిగా అనైతికమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలపైనా ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ఆ పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా? అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.  

More Telugu News