Andhra Pradesh: హోంగార్డుల దినసరి భత్యం పెంచిన ఏపీ ప్రభుత్వం

  • ఇప్పటివరకు రోజుకు రూ.600 భత్యం అందుకున్న హోంగార్డులు
  • ఇకపై ఆ భత్యం రూ.710కి పెంపు
  • ఈ నెల 1 నుంచి ఉత్తర్వులు అమలు

ఏపీ పోలీసు శాఖలో హోంగార్డులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హోంగార్డుల రోజువారీ భత్యాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు హోంగార్డులకు దినసరి భత్యంగా రూ.600 అందిస్తుండగా, తాజాగా ఆ భత్యాన్ని రూ.710కి పెంచారు. పెంపుదల ఉత్తర్వులు అక్టోబరు 1 నుంచే అమల్లోకి వస్తాయని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిశోర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

  • Loading...

More Telugu News