Pawan Kalyan: హరిద్వార్ లో పవన్ కల్యాణ్ బస చేసిన గది ఎలావుందో చూడండి... ఫొటోలు ఇవిగో!

- గంగానది ప్రక్షాళన పట్ల పవన్ శ్రద్ధ
- గంగానది పరిశీలన కోసం ఉత్తరాది పయనం
- హరిద్వార్ ఆశ్రమంలో బస
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు సమాజం, పర్యావరణం పట్ల ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఆయన గంగానది ప్రక్షాళన అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందుకే ఉత్తరాది వెళ్లి గంగానది తీరుతెన్నులు ప్రత్యక్షంగా పరిశీలించారు. హరిద్వార్ వెళ్లిన ఆయన అక్కడి పవన్ ధామ్ ఆశ్రమంలో బస చేశారు. తాను ఓ సెలబ్రిటీ అయినా ఎంతో సాదాగా ఉన్న గదిలో గడిపారు. ఓ బెడ్ తప్ప మరేమీ లేని గదిలో అతి సాధారణంగా బస చేయడం ద్వారా తన నిరాడంబరతను చాటారు.



