: 'దాదా'కు బంగ విభూషణ్ అవార్డు
భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్ గా ఖ్యాతినార్జించిన సౌరభ్ గంగూలీని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విశిష్ట పురస్కారంతో గౌరవించనుంది. గంగూలీని బంగ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. గంగూలీ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ చేతుల మీదుగా అందుకోనున్నాడు. ఈ నెల 20న జరిగే ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందించనున్నారు. కాగా, గంగూలీతోపాటు బాలీవుడ్ నట దిగ్గజం మిథున్ చక్రవర్తి, పారిశ్రామిక వేత్త బీకే బిర్లా తదితరులు కూడా ఈ బంగ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.