: రసవత్తర పోరుకు రంగం సిద్ధం
ఐపీఎల్-6లో ప్లే ఆఫ్ దశకు చేరాలని ఉరకలేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఫిక్సింగ్ స్కాంతో కుదేలైన రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. స్వంత మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో నెగ్గి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని సన్ రైజర్స్ భావిస్తుండగా, ఫిక్సంగ్ పాపంలో పాలుపంచుకుని ముగ్గురు క్రికెటర్లు దూరమవగా, ఆ ఛాయలేవీ ఆటపై పడనీయరాదని రాజస్థాన్ కృతనిశ్చయంతో ఉంది. దీంతో, పోరు మరింత రసవత్తరంగా సాగుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచే ఈ పోరులో సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.