Odisha: అవినీతి అధికారులపై ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • ఆదాయానికి మించిన ఆస్తులు
  • దర్యాప్తులో తేల్చిన అధికారులు 
  • నిర్బంధ పదవీ విరమణ ఇచ్చిన ప్రభుత్వం

అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిన నలుగురు ప్రభుత్వ అధికారుల విషయంలో ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్, ఒడిశా ప్రాంతీయ రవాణాశాఖ అధికారి సహా ఇద్దరు అటవీ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. వీరిపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ విభాగం ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీరందరికీ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొంది. దీంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఆ నలుగురిపై నిర్బంధ పదవీ విరమణ వేటు వేసింది. వారితో బలవంతంగా పదవీ విరమణ చేయించింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

More Telugu News