Chiru: చిరూ, కొరటాల సినిమాలో విజయశాంతి

  • రీ ఎంట్రీ ఇస్తోన్న విజయశాంతి 
  • 'ఎఫ్ 2' సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ 
  • కొరటాల సినిమా కోసం సంప్రదింపులు

తెలుగు తెరపై లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోయిన విజయశాంతి, ఆ తరువాత రాజకీయాల దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలా చాలా కాలం పాటు సినిమాలకి దూరమైన విజయశాంతి, తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆమె ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

ఈ సమయంలోనే 'ఎఫ్ 2' సీక్వెల్ లోను ఓ ముఖ్యమైన పాత్రకి విజయశాంతిని అనిల్ రావిపూడి ఒప్పించినట్టుగా వార్తలు వచ్చాయి. విజయశాంతి వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్పేస్తుండటంతో, భారీ ప్రాజెక్టుల నుంచి ఆమెకి అవకాశాలు వచ్చిపడుతున్నాయట. ఈ నేపథ్యంలోనే కొరటాల సినిమాకి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల ఒక సినిమా రూపొందించనున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన విజయశాంతిని సంప్రదించినట్టుగా సమాచారం. ఈ పాత్రను కొరటాల ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు

More Telugu News