Upasana: కోడలు ఉపాసన ఫొటోలు తీసిన మెగాస్టార్ చిరంజీవి

  • జిగేల్మనిపించేలా డ్రెస్సప్ అయిన ఉపాసన
  • ఫోన్ తో క్లిక్ మనిపించిన చిరు
  • సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేసిన ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్లిమ్ లుక్ తో ఉన్న చిరంజీవి ఎప్పట్లాగానే సింపుల్ డ్రెస్సింగ్ తో హుందాతనానికి ప్రతిరూపంగా దర్శనమిచ్చారు. అయితే ఈ కార్యక్రమం కోసం ఉపాసన డిజైనర్ దుస్తులతో రెడీ అయ్యారు. తన కోడల్ని చూసిన చిరు ఎంతో మురిసిపోవడమే కాదు ఫోన్ తో ఆమె ఫొటోలు తీశారు. ఉపాసన ఈ విషయాన్ని తనే వెల్లడించింది. ఫొటోలు తీస్తున్న చిరు ప్రతిబింబం అద్దంలో కనిపిస్తున్న విషయాన్ని వివరించింది. దీని తాలూకు ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. డాటర్స్ డేను ఓ మెగా ఈవెంట్ తో సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.

More Telugu News