Chandrababu: ఒక్కో ఇటుక పేర్చి అభివృద్ధి చేశాం... ఇప్పుడంతా రివర్స్ అయింది: చంద్రబాబు
- అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నామని వెల్లడి
- హైటెక్ సిటీని మించిన సిటీలను రూపొందించాలనుకున్నట్టు వ్యాఖ్య
- పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారంటూ సర్కారుపై విమర్శలు
హైదరాబాద్ కు దీటుగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించానని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైటెక్ సిటీని మించిన సిటీలను రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనుకున్నామని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ తీవ్రవాదాన్ని తట్టుకోలేకపోతున్నామని పారిశ్రామికవేత్తలే చెబుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఒక్కో ఇటుక పేర్చి సాధ్యమైనంత మేర అభివృద్ధి చేశామని, ఇప్పుడు మొత్తం రివర్స్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.