Syeraa: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒరిజినల్ ఫొటో ఇదిగో!

- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సైరా మేనియా
- అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సైరా
- ప్రతిష్ఠాత్మక చిత్రంపై భారీ అంచనాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సైరా మేనియా కనిపిస్తోంది. మరికొన్నిరోజుల్లో (అక్టోబరు 2న) రిలీజ్ కానున్న ఈ హిస్టారికల్ మూవీకి భారీ హైప్ లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటించిన చిత్రం సైరా. బ్రిటీష్ వాళ్ల పాలనను ఎదిరించిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే సైరా. అయితే ఇప్పటివరకు ఉయ్యాలవాడ గురించి సాధారణ ప్రజలకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పాలి. ఇక ఆయన ఎలా ఉంటాడన్నది ఎవరి ఊహకు అందని విషయం. కానీ, సోషల్ మీడియాలో ఇప్పుడాయన ఛాయాచిత్రం అందుబాటులోకి వచ్చింది. లైబ్రరీల్లో ఉన్న చారిత్రక పుస్తకాల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం లభించింది.
ఇదే ఆ ఫొటో...
