Amit Shah: పీవోకే ఏర్పాటుకు నెహ్రూనే కారకుడు: అమిత్ షా
- మహారాష్ట్రలో అమిత్ షా వ్యాఖ్యలు
- వేళకాని వేళ కాల్పుల విరమణ ప్రకటించారని వ్యాఖ్యలు
- కశ్మీర్ అంశాన్ని పటేల్ అయితే సమర్థంగా నిర్వర్తించేవాడన్న అమిత్ షా
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ఏర్పాటుకు నాడు జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. 1947లో కాల్పుల విరమణ ప్రకటించడం ఓ తప్పిదమని, భారత్ ఆధిక్యం కొనసాగుతున్నవేళ ఆ నిర్ణయం పీవోకే ఏర్పాటుకు దారితీసిందని అన్నారు. కశ్మీర్ అసమగ్రతకు నెహ్రూనే బాధ్యత వహించాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అవకాశం ఇచ్చివుంటే పరిస్థితిని చక్కదిద్ది ఉండేవాడని అమిత్ షా అభిప్రాయపడ్డారు. పటేల్ చేపట్టిన సంస్థానాల విలీనం ప్రక్రియ అంతా సజావుగానే సాగిందని, నెహ్రూ చేపట్టిన కశ్మీర్ అంశం మాత్రం సమస్యాత్మకం అయిందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ఓ సభలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.