: రక్తమోడిన పెషావర్
పాకిస్థాన్ లోని పెషావర్ రక్తమోడింది. శుక్రవారం సందర్భంగా ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్న రెండు మసీదుల వద్ద పేలుళ్ళు సంభవించాయి. పేలుళ్ళ తీవ్రత ఎక్కువగా ఉండడంతో 13 మంది మృతి చెందారు. మరో 45 మంది గాయపడ్డారు. ఈ దాడిలో రెండు మసీదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాక్ లోని రెండు ముస్లిం తెగల మధ్య అంతర్యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు.