Shilpa Chakravarthi: 'బిగ్ బాస్' హౌస్ లోకి మళ్లీ వెళ్లే ఛాన్స్ వస్తే నేనేంటో చూపిస్తాను: శిల్పా చక్రవర్తి
- నేను వైల్డ్ కార్డు ఎంట్రీతో వెళ్లాను
- అందరితో పాజిటివ్ గా వున్నాను
- బయటికొచ్చాక నాకు అర్థమైందన్న శిల్ప
'బిగ్ బాస్ 3' హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి, అక్కడి నుంచి బయటికి వచ్చేయడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. 'బిగ్ బాస్ 3'ని నేను టీవీలో చూసినప్పుడు నాకు అనిపించింది వేరు .. లోపల వుండి తెలుసుకున్నది వేరు.
హౌస్ లోకి వెళ్లకముందు వాళ్లు ఏం చేస్తున్నారన్నది చూశాను. నా గురించి వాళ్లు ఏం మాట్లాడుకున్నారన్నది నేను బయటికి వచ్చాక చూశాను. బిగ్ బాస్ హౌస్ లో నేను అందరితో పాజిటివ్ గా ఉంటూ వచ్చాను. ముఖ్యంగా వరుణ్ సందేశ్ ను హీరోను చేసి వచ్చాను. ఆయన నా గురించి హౌస్ లో మాట్లాడింది బయటికొచ్చి చూసిన నేను షాక్ అయ్యాను. జరిగిందంతా తెలుసుకున్నాక నేను ఇప్పుడు వైల్డ్ అయ్యాను. ఒకవేళ సెకండ్ ఎంట్రీ కనుక వుంటే, నేనేంటో చూపిస్తాను .. అప్పుడు నాదే పై చెయ్యి అవుతుంది" అని చెప్పుకొచ్చారు.