: రఘునందన్ ఆరోపణలపై స్పందించిన హరీశ్ రావు


పద్మాలయా స్టూడియో వివాదం వ్యవహారంలో ముడుపులు అందుకున్నట్టు బహిష్కృత నేత రఘునందన్ చేసిన ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. తనపై రఘునందన్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని చెప్పారు. దమ్ముంటే సీడీలను బయటపెట్టాలని రఘునందన్ కు సవాల్ విసిరారు. రఘునందన్ కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పద్మాలయా స్టూడియో యాజమాన్యం నుంచి హరీశ్ రావు రూ.80 లక్షలు అందుకున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ముడుపుల వ్యవహారం యావత్తూ మెదక్ ఎంపీ విజయశాంతి ఇంట్లో జరిగిందని కూడా ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News