: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓదేలు అరెస్ట్


టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఓపెస్ కాస్ట్ బొగ్గుగని ఏర్పాటుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఓపెన్ కాస్ట్ బొగ్గుగని ఏర్పాటును టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు ఎమ్మెల్యే ఓదేలు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు ఓదేలును ముందుగానే అరెస్ట్ చేశారు. దీనికి అడ్డుపడినన టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఓపెన్ కాస్ట్ బొగ్గు తవ్వకాలతో సమీపంలోని 300 గ్రామాలపై ప్రభావం పడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాలు వీటి వల్ల తీవ్ర కాలుష్యం బారినపడ్డాయని అందుకే దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని హైదరాబాద్ లో మీడియాకు తెలిపారు. 

  • Loading...

More Telugu News